జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ
WGL: పర్వతగిరి మండలం కొంకపాక, చింతనెక్కొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి అల్లందాసు బిక్షపతి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలని సూచించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు అక్కినపెల్లి సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.