VIDEO: రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తా: MLA

ADB: భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా తన వంతుగా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని రుయాడి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం ఆయన పర్యటించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని MLA అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు.