భర్తపై డీజిల్ పోసి కాల్చి చంపిన భార్యలు
NZB: భీంగల్ మండలం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవక్కపేటకు చెందిన మాలావత్ మోహన్(38)కు ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ కలహాలతో ఇవాళ అతనిపై భార్యలు డీజిల్ పోసి కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.