రోడ్డు విస్తరణ పనులతో ఇబ్బందులు

ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో ఒక పక్క రోడ్డు విస్తరణ పనులు మరోపక్క సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా వాహనాదారులు దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. వర్షాలు కురిస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని వారు వాపోతున్నారు.