అర్జీలు స్వీకరించిన కలెక్టర్
CTR: చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి, అధికారులకు తమ సమస్యలను విన్నవించి, అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.