ప్రత్యేక అలంకారంలో విరుపాక్షి మారెమ్మ

ప్రత్యేక అలంకారంలో విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం నడిబొడ్డున కొలువైన శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి పసుపు, కుంకుమ, అనప గింజలతో, నిమ్మ పండ్లతో, వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.