ఉద్యాన వర్సిటీ తాత్కాలిక వీసీగా ధనుంజయరావు
AP: వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ తాత్కాలిక ఉపకులపతిగా కె.ధనుంజయరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత ఉపకులపతి నియామకం జరిగే వరకు ఆయన పదవిలో కొనసాగుతారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వర్సిటీలోని ఇండస్ట్రియల్, అంతర్జాతీయ కార్యక్రమాల విభాగానికి డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.