దయాళ్ 'వర్క్ ఎథిక్' సూపర్: దినేశ్ కార్తిక్

CSKపై 2 పరుగుల తేడాతో RCB గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యశ్ దయాళ్ బౌలింగ్ ప్రదర్శనపై RCB మెంటార్ దినేశ్ కార్తిక్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం యశ్ 'వర్క్ ఎథిక్'పై డీకే మాట్లాడాడు. భారత్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో యశ్ కూడా ఉంటాడని కితాబిచ్చాడు. ప్రయత్నం చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడని.. ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉండడంతోనే అతడిని రిటైన్ చేసుకున్నట్లు తెలిపాడు.