రెండవ పంటకు సాగునీటిని విడుదల చేసిన నేతలు

రెండవ పంటకు సాగునీటిని విడుదల చేసిన నేతలు

NLR: విడవలూరు మండలంలోని చౌకిచర్ల చెరువు నుంచి ఈస్టర్న్ ఛానల్ డీసీ చైర్మన్ పాశం శ్రీహరి రెడ్డి, మండల పరిశీలకులు శ్రీధర్ రెడ్డి గురువారం లాంఛనంగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రెండవ పంటకు రైతన్నలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో నీటిని విడుదల చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.