కడెం ప్రాజెక్ట్ వరద గేట్లు తెరచే అవకాశం

NRML: కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈరోజు రాత్రి వరద గేట్లు తెరిచి నీటిని వదిలే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నది పరివాహక ప్రాంతం దిగువన పశువులు, పల్లెకారులు, గొర్రె కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.