మెట్టుగుట్ట రామాలయ హుండీ లెక్కింపు

మెట్టుగుట్ట రామాలయ హుండీ లెక్కింపు

HNK: కాజీపేట మండలం మడికొండలోని మెట్టుగుట్ట రామాలయ హుండీని శుక్రవారం ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, ప్రసాద్‌ల ఆధ్వర్యంలో లెక్కించారు. ఆలయంలోని 5 హుండీలను లెక్కించగా నోట్ల ధ్వారా రూ. 90,870, కాయిన్ల ధ్వారా రూ. 13671 మొత్తం రూ. 1,04,631ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో పారాశరం విష్ణువర్ధనాచార్యులు, అభిలాష్ శర్మ, సత్యనారాయణ శర్మలు పాల్గొన్నారు.