VIDEO: భగీరథ మహర్షి త్యాగం అందరికి ఆదర్శం: కలెక్టర్
MDK: జిల్లా కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగీరథుని పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.