మాధవనగరం గ్రామంలో బిర్సాముండా 150వ జయంతి

మాధవనగరం గ్రామంలో బిర్సాముండా 150వ జయంతి

AKP: నాతవరం మండలం మాధవనగరం గ్రామంలో బిర్సాముండా 150వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సోముల చినతల్లి బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గిరిజనుల హక్కులు, వారికి జరుగుతున్న అన్యాయాలపై బిర్సాముండా అనేక పోరాటాలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్ కృష్ణ, పాల్గొన్నారు.