బాధితులకు అండగా ఉంటాం: గుత్తుల సాయి
కోనసీమ: రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలంలో జరిగిన ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో 11 ఇళ్లు దగ్ధమై 14 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. బాధిత కుటుంబాలను జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు శుక్రవారం పరామర్శించారు. బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. వారు మాట్లాడుతూ.. బాధితులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.