VIDEO: శైవ క్షేత్రాలలో భక్తుల పూజలు
ప్రకాశం: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కనిగిరిలో ఉన్న శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా కొండపై వెలసి ఉన్న విజయ మార్కండేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.