కర్ణాటక బయలుదేరిన PU ఖోఖో జట్టు

కర్ణాటక బయలుదేరిన PU ఖోఖో జట్టు

MBNR: కర్ణాటకలోని దేవేంగిరి యూనివర్సిటీలో ఈనెల 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల ఖో-ఖో టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు PU జట్టు బయలుదేరింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు క్రీడాకారులకు అవసరమైన ట్రాక్‌సూట్లు, యూనిఫామ్‌లను అందజేశారు.