VIDEO: మర్రిపాడులో వింత ఘటన
NLR: మర్రిపాడు మండలంలోని పోలిరెడ్డిపల్లిలో సోమవారం వింత ఘటన చోటు చేసుకున్నది. గ్రామంలోని చెరువు కట్ట వద్ద ఉన్న ఓ వేప చెట్టుకు, పాలు కారుతున్నాయని గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో గ్రామస్తులు భారీగా అక్కడికి చేరుకుని హారతి కర్పూరాలు సమర్పించారు. చెట్టు వద్ద టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు.