'4 లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలి'

'4 లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలి'

ASF: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి కోడ్‌ల ప్రతులను దహనం చేశారు. కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు గోగార్ల తిరుపతి, రాజేందర్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.