మాతృత్వపు సెలవులు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

మాతృత్వపు సెలవులు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల హక్కుల్లో మాతృత్వపు సెలవులు అత్యంత కీలకమని వ్యాఖ్యానించింది. మాతృత్వపు సెలవు అనేది కేవలం ఒక సౌలభ్యం కాదని, అది మహిళల ప్రాథమిక హక్కుల్లో భాగమని నొక్కి చెప్పింది. పిల్లల సంరక్షణ, తల్లి ఆరోగ్యం దృష్ట్యా మాతృత్వపు సెలవులు అత్యవసరమని పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.