గ్రామ పంచాయితీలతోనే వేగవంతమైన సేవలు: మంత్రి

KNR: సైదాపూర్ మండలం నల్లనిరామయ్యపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన గ్రామ పంచాయితీ భవనాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ దొంత సుధాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు మిడిదొడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.