ECపై ఇండి కూటమి తీవ్ర విమర్శలు

కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై ఇండి కూటమి నేతలు విమర్శలు చేశారు. 65 లక్షల ఓట్ల తోలగింపుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు. మహాదేవపుర ఓటరు మోసంపై సమాధానం చెప్పలేదని తెలిపారు. రాహుల్ ఆరోపణలపై EC తప్పించుకుందని విమర్శించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు.