విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

KDP: చాపాడు మండలం నరహరిపురం గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో 32 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసినట్లు హెచ్ఎం నరసింహ శాస్త్రి తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు పుష్పలత, నాగమణి, శిరీష, శ్రీనివాసులు, రాజశేఖర్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చాటుతున్న 16 మంది బాలికలు, 16 మంది బాలురకు రూ. 12,500 విలువ చేసే క్రీడా దుస్తులను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.