MRPS.T జిల్లా అధ్యక్షునిగా బాబు
HNK: MRPS.T (మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ) జిల్లా అధ్యక్షులుగా చిలువేరు బాబు మాదిగ నియమింపబడ్డారు. ఈమేరకు కేయూ సమీపంలో రాష్ట్ర అధ్యక్షులు బొక్కల వెంకటస్వామి శుక్రవారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. మాదిగల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జిల్లా అధ్యక్షుడు బాబు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి ధన్యవాదాలు చెప్పారు.