'పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత'
ప్రకాశం: కంభం పట్టణంలో ఎంపీడీవో వీరభద్రచారి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.