శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,241 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.08 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.