పేదల ఇళ్లు కూల్చడం బాధాకరం: బ్రహ్మనాయుడు

పేదల ఇళ్లు కూల్చడం బాధాకరం: బ్రహ్మనాయుడు

PLD: వినుకొండ మండలం వెల్లటూరులో వైసీపీకి ఓటేశారన్న పేరుతో పేదల ఇళ్లు కూల్చడం అమానుషమని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, అధికారులు కూటమి నాయకులకు లొంగి పనిచేస్తున్నారని విమర్శించారు. బాధితులకు నష్టపరిహారం, విద్యుత్ పునరుద్ధరణ కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.