అత్యంత వైభవంగా శివ పార్వతుల కళ్యాణం
VZM: స్థానిక బుచ్చెన్న కోనేరు వద్ద గల శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం శివ పార్వతుల కళ్యాణం అత్యంత ఘనంగా జరిపారు. ఆలయ అర్చకులు శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు మద్దిల అప్పలనాయుడు ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.