డీపీఓగా డ్వామా పీడీకి అదనపు బాధ్యతలు
కృష్ణా: జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివప్రసాద్‌కు ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న అరుణ పదోన్నతిపై జడ్పీ సీఈవోగా నియమితులయ్యారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.