అన్నలూరులో రైతన్న మీకోసం కార్యక్రమం

అన్నలూరులో రైతన్న మీకోసం కార్యక్రమం

KDP: మైదుకూరు మండలం అన్నలూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతును రాజును చేసేందుకు 5 విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేపట్టారన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రభుత్వం నుంచి మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు.