పదవి విరమణ చేసిన హెచ్ఎంకు సత్కారం
AKP: ఏటికొప్పాక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తూ శుక్రవారం పదవి విరమణ చేసిన హెచ్ఎం కేవీ సూర్యనారాయణకు పలువురు ఉపాధ్యాయులు ఘనంగా వీడ్కోలు పలికారు. విద్యా కమిటీ ఛైర్మన్ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎంను ఘనంగా సత్కరించారు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన హెచ్ఎంను ఆదర్శంగా తీసుకోవాలని రామకృష్ణ సూచించారు.