'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

WNP: సెప్టెంబర్ 13న జిల్లా కోర్టులలో నిర్వహించనున్న 'జాతీయ అదాలత్'ను సద్వినియోగం చేసుకోవాలని రేవల్లి ఎస్సై రజిత అన్నారు. తీర్పు వల్ల కక్షిదారుడు ఒక్కరే విజయం సాధిస్తే 'లోక్ అదాలత్ 'తో ఇరువర్గాలు రాజీ కావడంతో ఇరువురు విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, భూ వివాదాల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.