VIDEO: ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన పీడీ
NLR: వింజమూరులో నీటిపారుదల కార్యాలయం నుంచి బంగ్లా సెంటర్ వరకు నిర్మిస్తున్న ట్యాంక్ బండ్ పనులను డ్వామా అడిషనల్ పీడీ స్వరూప్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. వీ.బీ.జీ రామ్‌జీ పథకం ద్వారా ట్యాంక్ బండ్ నిర్మాణానికి 50 లక్షలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.