పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జనరల్ అబ్జర్వర్

NZB: నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్, నందిపేట్, డొంకేశ్వర్, ఆలూరు మండల కేంద్రాల్లోని పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ గురువారం సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.