భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

KRNL: గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా వంకర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి గ్రామంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక పంట పొలాల్లో నీరు నిలిచిపోయి రైతులకు నష్టం వాటిల్లింది.