నాడు 3 ఓట్లతో ఓటమి.. నేడు బంపర్ మెజారిటీ
KNR: కుబీర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సాయినాథ్ సత్తా చాటారు. ఎన్నికల్లో 285 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిని మట్టి కరిపించారు. గతంలో 3 ఓట్ల తేడాతో ఓడిపోయిన సాయినాథ్, ఈసారి తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందడం విశేషం. ఫలితం వెలువడిన వెంటనే మద్దతుదారులు ఆయనను పూలమాలలతో ముంచెత్తారు. గ్రామాభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తానని అన్నారు.