అంకమ్మ తల్లికి ఆషాఢ సారె సమర్పణ

అంకమ్మ తల్లికి ఆషాఢ సారె సమర్పణ

GNTR: ఆషాఢ మాసం మహోత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. శుక్రవారం చౌత్రా సెంటర్‌లోని కోట్ల అంకమ్మ తల్లికి ఆషాఢ సారె సమర్పించారు. ఈ సందర్భంగా రామాలయం నుంచి అంకమ్మ తల్లి దేవాలయం వరకు బోనాలు ఎత్తుకొని మహిళలు ప్రదర్శనగా వచ్చారు. స్థానిక మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.