రూ.4 కోట్లతో రహదారి పనులు ప్రారంభం

రూ.4 కోట్లతో రహదారి పనులు ప్రారంభం

SKLM: సరుబుజ్జిలి(M) పర్వతాలు పేట నుంచి సిద్ధాంతం గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ ఎన్ .రాజ్యలక్ష్మి, టీడీపీ ఉపాధ్యక్షులు ఎన్ .గోవిందరావు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.4 కోట్లతో 2 కిలోమీటర్ల మేర ఈ రహదారి పనులు ప్రారంభించారు. ఎన్నో దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన ఈ రోడ్డు నిర్మాణం MLA రవికుమార్ కృషితో సాధ్యమైందని గోవిందరావు తెలిపారు.