22 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

SKLM: మెలియాపుట్టిలో 22 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ రామారావు, ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. శనివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా మెలియాపుట్టిలోని మహేంద్రతనయ నది బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి లభ్యమైందన్నారు.