వరి వంగడాలపై క్షేత్ర దినోత్సవం
PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామంలో రైతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా KNM7715 వరి వంగడాలపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. రైతు కొప్పుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ వరివంగడాలో చీడపురుగులు తక్కువగా ఉండి, తక్కువ ఎరువులతో అధిక నాణ్యత గల గింజలు, మంచి అన్నం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొని పంటను పరిశీలించారు.