సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరసన

BDK: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట బుధవారం కార్మిక సంఘాల జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం సరికాదు అన్నారు.