VIDEO: యూరియా కోసం క్యూలైన్‌లో రైతులు.
WGL: దుగ్గొండి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ వద్ద ఈరోజు ఉదయం యూరియా బస్తాల కోసం రైతులు క్యూ లైన్‌లో బారులుతీరారు. పంటలకు అత్యవసరంగా అవసరమైన యూరియా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. ఎరువుల కొరతను తక్షణమే నివారించి, అందరికి సమానంగా యూరియా బస్తాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.