రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!
NGKL: ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. NGKL జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 7,557 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 7,616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు.