అదనపు కట్నం కోసం ఆదివాసీ యువతికి వేధింపులు
ADB: అదనపు కట్నం కోసం ఆదివాసీ యువతిని వేధింపులకు గురి చేయడంతో ఆదివాసీ గిరిజన సంఘ సభ్యులు ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం గిరిజన సంఘ రాష్ట్ర కార్యదర్శి సచిన్ మాట్లాడుతూ.. విజయ్ రెడ్డిఅనే వ్యక్తి గిరిజన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వరకట్నం కోసం చిత్రహింసలకు గురిచేశాడు. వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.