రేపు దనియాని చెరువుకు ఎమ్మెల్యే రాక
సత్యసాయి: నంబులపూలకుంట మండల పరిధిలోని దనియాని చెరువు పంచాయతీలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రేపు పర్యటిస్తారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఎమ్మెల్యే అక్కడ పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరుకావాలని కోరారు.