కళాశాలలో ఎర్త్ అవర్ పోస్టర్ ఆవిష్కరణ

కళాశాలలో ఎర్త్ అవర్ పోస్టర్ ఆవిష్కరణ

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'ఎర్త్ అవర్' పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. అయోధ్య రెడ్డి, ప్రొఫెసర్ మట్టా సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే 'ఎర్త్ అవర్' (Earth Hour) కార్యక్రమంపై అవగాహన కల్పించారు.