'విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి'
CTR: చిత్తూరు పట్టణంలోని డిగ్రీ కళాశాలలో పోలీసులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర, క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలతో అనర్థాలు, రోడ్డు నిబంధనలు, మహిళలపై జరిగే ఆకృత్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.