ఈ నెల 15 నుంచి భావనపాడుకు ఆర్టీసీ బస్సులు

ఈ నెల 15 నుంచి భావనపాడుకు ఆర్టీసీ బస్సులు

SKLM: సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు గ్రామానికి ఈ నెల15 నుంచి ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామానికి గత మూడేళ్లుగా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో గ్రామంలో మత్స్యకారులు, విద్యార్థులు తదితరులు గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి, అధికారులకు సమస్యను పరిష్కరించాలని సూచించారు.