జామియా మసీదు వద్ద చలివేంద్రం ప్రారంభం
PLD: నరసరావుపేటలో గుంటూరు రోడ్డులోని జామియా మసీదు వద్ద ఉచిత చలివేంద్రాన్ని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో మంచినీళ్లు, మజ్జిగ, లస్సీ పంపిణీ చేస్తున్నారు. వేసవి దృష్ట్యా ఇది ప్రజలకు ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.