నీట్ పరీక్షా కేంద్రాలుగా ఎంపిక.. పలు ప్రాంతాల పరిశీలన

GDWL: నీట్ యూజీ - 2025 పరీక్షను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు, పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాలను నీట్ పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేయడానికి ఎస్పీ శ్రీనివాసరావు, తదితరులు పరిశీలించారు.