రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
SDPT: చేర్యాల పట్టణ శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక యువకుడు, దంపతులు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. కాగా, గాయపడిన దంపతులలో భర్త బాల్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొండుతూ మృతి చెందాడు. బాల్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం చేర్యాల మార్చురీకి తరలించారు.